డైలీ భారత్, తూప్రాన్: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజక వర్గం తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఘనంగా మహాత్మా జ్యోతి బాపూలే జయంతి వేడుకలు.మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది. #మహాత్మ_జ్యోతిబాపూలే# గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు.మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని.. అందరికీ విద్యనందేలా కృషిచేసిన మహనీయుడు, తత్వవేత్త, సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి.*కులం పేరుతో తరతరాలుగా అన్నిరకాలుగా అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి హక్కుల కోసం పోరాడి , సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఆబొతు వెంకటేశ్ యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాసరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సర్గాల రాములు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటొల్ల శివ కృష్ణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అధ్యక్షులు బాయికాడి అంజి, బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఇమాంపూర్ వెంకట్ గౌడ్,గడ్డం వెంకటేష్,గౌటి బాలేష్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రమేష్, జక్కపురం నాగరాజు, బందెల నరేష్, బుక్క విజయ్ తదితరులు పాల్గొన్నారు