| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ట్రాలీ ఆటో చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు, యజమాని

ట్రాలీ ఆటో చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు, యజమాని

తాగిన మత్తులో నా ఆటోనో ఆయన ఆటోనో తెలియలేదు

నా ఆటో అనుకొని ఆయన ఆటోను తీసుకెళ్తున్నాను

నా పెళ్ళాం లేచిపోయింది నేను తాగుడుకు బానిస అయ్యాను

తప్పయింది కాళ్లు మొక్కుతా విడిచిపెట్టుర్రి

ట్రాలీ ఆటో చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు, యజమాని

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ట్రాలీ ఆటో చోరికి పాల్పడిన వ్యక్తిని వెంబడించి గ్రామస్తుల సహాయంతో పట్టుకొని పోలీసులకు అప్పగించిన యజమాని బండారి లక్ష్మణ్ వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ ట్రాలీ ఆటో స్టాండ్ నుండి గుర్తుతెలియని దొంగ చోరీకి పాల్పడి  బుధవారం రాత్రి 9-00  గంటల సమయం లో ట్రాలీ ఆటో తో పారిపోతుండగా  ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గాజులపల్లి సమీపంలో  గ్రామస్తులు  ట్రాలీ ఆటోను దొంగలించిన చిత్తారి శివాను పట్టుకొని తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి బంధించి పోలీసులకు అప్పగించారు.

ట్రాలీ ఆటో యజమాని సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ కు చెందిన  బండారి లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట పోలీసులకు సమాచారము అందించాడు

నా ఆటో అనుకొని ఆయన ఆటోను తీసుకెళ్తున్నాను

ఆటోను దొంగలించిన వ్యక్తి వివరాలు ఆరా తీయగా నా పేరు శివ నా పెళ్ళాం  లేచిపోవడంతో తాగుడుకు బానిస అయ్యాను.  తాగిన మత్తులో నా ఆటోనో ఆయన ఆటోనో తెలియలేదు. ఆటో తీసుకొని వెళుతుంటే వెంబడించి పట్టుకొని కొట్టి తాళ్లతో కట్టి వేశారు. తప్పయింది మన్నించురు అని శివ వేడుకున్నాడు.

ఎల్లారెడ్డిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్   కిషన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి  వెళ్లి తాళ్లతో బంధించిన శివాను  చోరీకి గురైన ట్రాలీ ఆటోను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్రాలీ ఆటోను దొంగలించిన చిత్తారి శివను సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Previous తెలంగాణలో మరో భారీ స్కామ్....ఐదు వేల సిఎంఅర్ఎఫ్ చెక్కులు మిస్సింగ్
Next బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT