| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: నారా భువనేశ్వరి

 చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: నారా భువనేశ్వరి

డైలీ భారత్, రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్‌హెడ్‌ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం అని తెలిపారు

Previous ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
Next సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పేరు గ్రామ నాయకులు
ADVERTISEMENT