| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు వేములవాడలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

నేడు వేములవాడలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి.

ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపా ర్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో ఐదు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేసి నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

కాగా బుధవారం సాయం త్రం 3 గంటల వరకు కోళ్ల మొక్కుల చెల్లింపులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Previous నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ హంగామా
Next లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
ADVERTISEMENT