షాద్ నగర్ మాజీ కౌన్సిలర్ దివంగత ఐటిఐ రాజు వర్ధంతి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్‌నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డు సభ్యుడు ఐటిఐ రాజు (లక్ష్మణ్ గౌడ్) వర్ధంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాలనీలోని ఐటీఐ రాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కె. చెన్నయ్య, పీసీసీ సభ్యులు మహ్మద్ అలీఖాన్ బాబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెంటయ్య యోజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందెమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐ రాజు కుటుంబసభ్యులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.