డైలీ భారత్, అమరావతి: ఇవాళ ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. చిలక లూరిపేటలో టీడీపీ-జన సేన-బీజేపీ కూటమిలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
ఈ సభకు ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.చిలకలూరిపేటలో నిర్వహించే ఈ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టా తక్మంగా తీసుకుంది.
మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న ఈ తొలి సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ సభలో ఉమ్మడి కార్యచరణ, ఎన్నికల మేనిఫెస్టోను ప్రక టించే అవకాశం ఉంది.
ఈ సభ నిర్వహణకోసం ప్రత్యేకంగా 13 కమిటీలను నియమించింది. ప్రతి కమిటీలోనూ టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలకు హెడ్‌గా లారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
3 పార్టీలు కలిసి సభను నిర్వహిస్తుండటంతో మూడు పార్టీల నేతలు భారీగా హాజరుకానున్నారు. దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది హాజరు వుతారని అంచనా వేస్తోంది
అధిష్టానం. ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని నిర్వ హిస్తున్నారు. దూరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు.. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.