| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వడగళ్ల వానలకు రైతన్న విలవిల

వడగళ్ల వానలకు రైతన్న విలవిల

డైలీ భారత్, కామారెడ్డి: వడగండ్ల వాన... రైతుల పట్ల కడగండ్లుగా మారా యి. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో ఈదురు గాలితో కూడిన వడగళ్ల వాన కురిసింది.

సుమారు గంటపాటు వడ గళ్ల వాన కురియడంతో గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు.

అంతేకాకుండా గ్రామంలో సాగుచేసిన పలు పంటలకు వడగళ్ల వాళ్ళతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వడగళ్ల వానతో నష్టపో యిన రైతులను ఆదుకోవా లని రైతులు కోరుతున్నారు.

గత రాత్రి కరీంనగర్ జిల్లాలో కూడా వర్షపాతం నమోదయింది

Previous అమల్లోకి ఎన్నికల కోడ్.. నగదు తరలింపునకు అధికారుల సూచనలు
Next ఏపీలో మోదీ ప‌ర్య‌ట‌న‌… కూట‌మి బ‌హిరంగ స‌భ
ADVERTISEMENT