| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా ఛింపుల సత్య నారాయణ రెడ్డి

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా ఛింపుల సత్య నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్  సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్  సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా బీమ్ భరత్ శాలువాతో  సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పీసీబీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతకుమారిని నియమించగా, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి సభ్యునిగా రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పీసీబీ సభ్యులుగా 15 మందిని నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ పీసీబీ మండలి సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Previous కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మన్నే జీవన్ రెడ్డి
Next సిరిసిల్ల జిల్లాలో మహిళ గొంతు కోసి దారుణ హత్య
ADVERTISEMENT