| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

డైలీ భారత్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌ య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఆ వ్యక్తి పూర్తిగా రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Previous ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు
Next విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సైబర్ సెక్యూరిటీ DSP శ్రీనివాసరావు
ADVERTISEMENT