| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్టీసి బస్సులో మంత్రి పోన్నం ప్రభాకర్

ఆర్టీసి బస్సులో మంత్రి పోన్నం ప్రభాకర్

షాద్ నగర్ వరకు నిలబడే ప్రయాణం

మహిళా ప్రయాణికులతో పంచుకున్న ఉచిత ప్రయాణం విశేషాలు

బస్సులో ప్రయాణించిన మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆదివారం పాలమూరు జిల్లాలో గౌడ సంఘ సమావేశానికి రానున్న సందర్భంగా ఆయన హైదరాబాద్ నుండి షాద్ నగర్ వరకు ఆర్టిసి బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపోకు చెందిన బస్సులో ఆయన  బస్సులోని ప్రయాణికులతో మాట్లాడారు. బస్సులో ఆయన కూర్చోకుండా నిల్చుండే ప్రయాణికులతో ఉచిత ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళ ప్రయాణికులతో వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవడంతో పాటు ఉచిత ప్రయాణం ఎలా ఉందని అందరిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం పట్ల మహిళా ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడంతో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని మంత్రి ప్రభాకర్ చెప్పారు. షాద్ నగర్ శివారులో హోటల్ 44 దాబా వద్ద ఆయన బస్సు దిగారు. బస్సు దిగగానే ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్యాం సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. బస్సు ప్రయాణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మిత్రులతో తన అనుభవాలను పంచుకున్నారు. మంత్రి బస్సు ప్రయాణాన్ని పలువురు ప్రశంసించారు..

Previous మరో ముగ్గురు బీఆర్‌ఎస్ ఎంపిలు బీజేపీలో చేరనున్నారా..?
Next షాద్ నగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT