| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్...25 లక్షల విలువగల పరికరాలను సీజ్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్...25 లక్షల విలువగల పరికరాలను సీజ్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

DJ సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనం చేస్తున్న 4 గురు నిందితులు.

నిందితులపై 11 దొంగతనాల కేసులు.

25 లక్షల పై విలువగల పరికరాలు సీజ్ చేసి కేసు నమోదు చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు.

డైలీ భారత్, సూర్యాపేట: జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే IPS ఆదేశాల మేరకు ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాము, దీనిలో భాగంగా ఈరోజు ఉదయం జాతీయ రహదారి 65 పై సూర్యాపేట పట్టణం పరిది జనగాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సౌండ్ సిస్టం కు సంబందించిన ఎలక్రానిక్ పరికరాలను గుర్తించడం జరిగినది. వాహనంలో ఉన్న నల్గొండ జిల్లా అడివిదేవులపల్లి మండలానికి చెందిన కుర్ర తుల్చా అనే వ్యక్తిని విచారించగా దొంగిలించిన వస్తువులు అని ఒప్పుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారించగా కోదాడ కు చెందిన దరావత్ బాలకృష్ణ, బర్మావత్ గురు చరణ్, నల్గొండ జిల్లా కు చెందిన రమావత్ వంశీ లతో కలిసి దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడు అని DSP తెలిపినారు. నిందితుల నుండి 25 లక్షల విలువగల సౌండ్ సిస్టమ్స్ కు సంభందించిన ఎలక్ట్రానిక్ పరికరాలు  27- ఆంప్లిఫయర్లు, 

7 - క్రాస్ ఓవర్స్,  6-మిక్సర్లు స్వాధీనం చేసుకోవడం జరిగినది అన్నారు. A-1 నిందితుడు కుర్ర తుల్చా పై గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం కేసు కలదు. A-2 బాలకృష్ణ, A-3 గురు చరణ లపై గతంలో కోదాడ టౌన్ పి. యస్ లో గంజాయి కేసు లో  ముద్దాయిలుగా గత నేర చరిత్ర ఉన్నది అన్నారు.

నిందితుడు కుర్ర తుల్చ హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవిస్తూ వచ్చే డబ్బులు సరిపోక తన స్నేహితులైన కోదాడ కు చెందిన బాలక్రిష్ణ @ సిద్దు, గురు చరణ్ @ గురు లతో కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి పూట ఫంక్షన్ హాల్ లలో, డీజే షాప్ ల ముందు ఉంచిన  డీజే సౌండ్ సిస్టమ్ లను ఎలాగైనా దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దాం అనుకోని పథకం వేసుకొని దిల్ షుక్ నగర్ లో గల లాంగ్ డ్రైవ్ కార్స్ లలో కార్ లను కిరాయికి తీసుకోని అక్కడి నుండి బయలుదేరి గత సంవత్సరం నవంబర్ నెల నుండి మాచర్ల, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు, చివ్వెంల ఏరియా లలో రాత్రి పూట సంచరిస్తూ ఫంక్షన్ హాల్ లలో, డీజే షాప్ ల ముందు ప్రోగ్రామ్ చేసి వచ్చాక పార్కింగ్ చేసిన వాహనాలలో నుండి ఆంప్లిఫయర్లు, మిక్సర్లు, క్రాస్ ఓవర్స్, లను దొంగిలించి వాటిని ఒక దగ్గర దాచి పెట్టి వీలు కుదిరినప్పుడు  వేరే ప్రాంతాలకి తీసుకోని వెళ్ళి అమ్ముదామని అనుకోని ఈ రోజు ఒక వాహనాన్ని కిరాయికి తీసుకోని వాటిలో దొంగిలించిన డీజే సౌండ్ సిస్టమ్ వస్తువులను తరలిస్తుండగా జనగాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వాహనం అనుమానాస్పదంగా వెల్లుతుండగా దానిని ఆపి చెక్ చేసి అందులో గల వ్యక్తి ని  విచారించగా, అతను మాచర్ల, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు, చివ్వెంల లలో చేసిన దొంగతనాలు ఒప్పుకోగా పంచనామా జరిపి రిమాండ్ కు పంపనైనది అని అన్నారు.

కేసు లో బాగా పని చేసిన  సూర్యాపేట పట్టణ Inspector జి. రాజశేఖర్, SI లు యస్.కె. యాకూబ్, పి. లోకేష్, బాలక్రిష్ణ, మరియు  క్రైమ్ సిబ్బంది కరుణాకర్, కృష్ణ, సైదులు, ఆనంద్,మధు మరియు ఐ.టి సెల్ సుధాకర్, రవిలను సూర్యాపేట జిల్లా SP రాహుల్ హెగ్డే అభినందించడం జరిగినది అని DSP తెలిపినారు. ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి SP రివార్డ్స్ ప్రకటించినారు.

Previous రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజుబకాయిలను చెల్లించాలి : టిఎన్ఎస్ఎఫ్
Next షాద్‌నగర్‌కు చేరుకున్న బుల్లెట్‌ రాణి యాత్ర
ADVERTISEMENT