| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మేల్యే హరీశ్ రావు పై ధ్వజమెత్తిన షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు

ఎమ్మేల్యే హరీశ్ రావు పై ధ్వజమెత్తిన షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు

ఎమ్మేల్యే హరీశ్ రావుకు ఇంకిత జ్ఞానం లేదు

కాలేశ్వరం అవినీతిలో ముందుగా జైలుకుపోయేది హరీశ్ రావే

పదేళ్లు మీ మామ.. నీవు.. నీ చుట్టాలు తిన్న సొమ్ము కక్కిస్తాం

అడ్డగోలు హామీలు ఇచ్చి పదేళ్లు పాలన చేసింది మీరు

అనుభవించిన అధికారం సరిపోలేదా..?

షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు బాబర్ ఖాన్ , తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీను నాయక్ తదితరుల విమర్శలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :ఫోన్ చేస్తే చాలు గంటలో షాద్ నగర్ వస్తా అంటూ ప్రగల్బాలు పలికిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గంటలో వచ్చి ఏం పీకుతారని షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి .రఘు, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, గిరిజన నేత శ్రీను నాయక్ తదితరులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.. నిన్న జరిగిన బిఆర్ఎస్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితోక్తి పలికారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది మీ మామ కేసిఆర్ కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ జరిగిందని అబద్ధాలు చెప్పి ఓట్లు పొందింది మీరు కాదా, అదేవిధంగా ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బులు వేస్తామని చెప్పి అవే డబ్బులు కాంట్రాక్టర్లకు చెల్లించింది మీ మామ కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మీ మామ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఏమైపోయాయని ప్రశ్నించారు. కనీసం పదవ తరగతి పరీక్షలు కూడా సజావుగా నిర్వహించని దౌర్భాగ్యులు టిఆర్ఎస్ నాయకులని విమర్శించారు. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి జీర్నిచుకోలేకపోతున్నారని అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చి కేవలం 70 రోజులు మాత్రమే అయ్యిందని ఇంకా అధికార మదంతో టిఆర్ఎస్ నాయకులు కొట్టుకుంటున్నారని అన్నారు. రెండు నెలలు గడవకముందే అధికారం లేకుంటే పిచ్చి పట్టే పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావుకు కనీసం అంకిత జ్ఞానం కూడా లేదని 420 మాటలు చెప్పి పదేళ్లు పాలించింది ఎవరో గుర్తు చేసుకోవాలని అన్నారు. మొదటి నుండి మోసపూరిత వాగ్దానాలు చేసుకుంటూ కేసీఆర్ పబ్బం గడుపుకున్నాడని అన్నారు. ప్రజలు చీ కొట్టారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 80% పూర్తయ్యాయని చెప్పడానికి హరీష్ రావుకు సిగ్గుండాలని విమర్శించారు. మొత్తం ప్రాజెక్టుకి 32 వేల కోట్లు కేటాయిస్తే 28 వేల కోట్లతో ప్రాజెక్టు 80% పనులు ఎక్కడ జరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు గంప మట్టి కూడా ఎత్తలేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్ని విషయాలు శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు. అదేవిధంగా కరెంటు సరఫరా చేయలేకపోతున్నామని అనేక నిందలు వేశారని కానీ విద్యుత్ శాఖ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మెయింటెనెన్స్ పనుల కోసం విద్యుత్ కొరత ఏర్పడితే దానిని గోరంతను కొండంతలుగా చేసి అబద్ధాలు ప్రచారం చేసిందని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి బట్ట కాల్చి మీద వేయడం అలవాటని అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుని గతంలో అనేక నల్ల చట్టాలకు మద్దతు పలికిన ఘనత మీ మామ కేసీఆర్ దని విమర్శించారు. నోట్ల రద్దు, రైతు నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు చేసింది బిజెపికి మద్దతు ఇచ్చింది కేసీఆర్ అని విమర్శించారు. 

ఇంకా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ అక్రమాలు అవినీతి చాటంత అవుతాయని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిని గెలిగితే ముందు జైలుకుపోయేది హరీష్ రావు అని వారు హెచ్చరించారు. టిఆర్ఎస్ పాలనలో అధికారులు అడ్డగోలుగా వేల కోట్లు ఎలా సంపాదించారో జగజ్యోతి లాంటి అధికారుల ఆస్తులు చూస్తేనే అర్థమవుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఖదీర్, అజ్మత్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Previous షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన శ్రీను నాయక్
Next బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బానోతు విజయలక్ష్మి
ADVERTISEMENT