| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన శ్రీను నాయక్

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన శ్రీను నాయక్

మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని

మా ఎమ్మెల్యేనే కించపరుస్తావా..?

కోర్టు, పోలీసుల సాక్షిగా ఎమ్మెల్యే శంకర్ కు బెదిరింపులు

2017లో ఎమ్మేల్యే ఎవరో ముందు టెలుసుకో

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: కాసులాబాద్ శంకర్  చేతకాని రాజకీయం చేస్తున్నాడు వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ 

షాద్ నగర్ న్యాయస్థానం, పోలీసుల సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మీడియా సాక్షిగా బెదిరించిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరిజన నేత శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ రెడ్డి పై శ్రీను నాయక్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే శంకర్ ను బెదిరించే విధంగా మాట్లాడారని, ఒక ప్రజాప్రతినిధి అన్న గౌరవం లేకుండా వాడు వీడు అంటూ సంబోధించారని న్యాయస్థానంలో ఒకదోషి ఇలా మాట్లాడితే ఎలా అని శ్రీను నాయక్ ప్రశ్నించారు. ఇతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని, పోలీసులను గౌరవించకుండా కోర్టు ప్రాంగణంలో నవీన్ రెడ్డి మాట్లాడిన వీడియోలు శ్రీను నాయక్ మీడియాకు విడుదల చేశారు. పోలీస్ కస్టడీ, రిమాండ్ కు మధ్య సమయంలో అందరి ముందు కోర్టు ప్రాంగణంలో నవీన్ రెడ్డి ఎమ్మెల్యేను తన మాటల ద్వారా బెదిరించే విధంగా చూశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని కోరారు.

Previous మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే హరీష్ రావు
Next ఎమ్మేల్యే హరీశ్ రావు పై ధ్వజమెత్తిన షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు
ADVERTISEMENT