| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం

జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం

ఫిర్యాదులు కు స్పందించిన ఎస్పీ

డైలీ భారత్, మెదక్:

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో జిల్లా ఎస్.పి డా..బి.బాలస్వామి  ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో శివాయపల్లి గ్రామానికి చెందిన ఉడుత శ్రీలత తనకు 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుందని పెళ్లి జరిగిన కొన్ని రోజులు బాగుండి తర్వాత నుండి నా భర్త కొట్టడం తిట్టడం మొదలు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆ భాధలు భరించక తన తల్లి గారి ఇంటికి వచ్చిన కూడా రోజు రాత్రి నా భర్త వచ్చి నన్ను నా కొడుకు మరియు మా అమ్మ నాన్న ను చంపుతానని ఇంట్లో ఉన్న సి  సి కెమెరా, స్మార్ట్ ఫోన్ మరియు ఇతర సమానులను పగుల కొట్టినాడని, అతని వల్ల మాకు ప్రాణ భయం ఉందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి.ఐ. కి సూచనలు చేయటం జరిగింది. అలాగే సోమక్కపేట గ్రామానికి చెందిన రాదగొని మానస తన స్వంత స్థలం లో ఇంటి నిర్మాణం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు నిర్మాణం చేయనివ్వకుండా మేస్త్రిని అడ్డు కుంటున్నారని, వారిని బూతుమాటలు తిట్టి, కొడుతున్నారని, వారిని చంపుతామని బెదిరిస్తున్నారని కావున న్యాయం చేయాలని కోరగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నర్సాపూర్ సి.ఐ. కి తగు సూచనలు చేయటం జరిగింది.

Previous చేగుంట పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై కి శాలువాతో సన్మానం
Next ఏసీబీకి వలకు చిక్కిన మహిళ అధికారిని
ADVERTISEMENT