డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. అధికారం కోల్పోవడంతో పట్టు కోల్పోతున్న గులాబీ దళంలోంచి ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రినిశ్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తమ కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కలిశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు..
News
సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు