డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి బుదవారం ఉదయం శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. భార్య పిల్లలతో కలిసి శ్రీశైలం వచ్చిన చల్లా వంశీచంద్ రెడ్డి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దీనికి ముందు ఆలయానికి విచ్చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేసారు .చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులకు పిల్లలకు వేదపండితులు ఆశీర్వచనం పలికారు.
News
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న చల్లా వంశీచంద్ రెడ్డి, స్వామివారికి ప్రత్యేక పూజలు