| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేటాడుతాం: మాజీ సీఎం కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేటాడుతాం: మాజీ సీఎం కేసీఆర్

డైలీ భారత్, నల్గొండ జిల్లా: బిడ్డా జాగ్రత్తా..! బతుక నివ్వం.. వెంటపడుతం.. వేటాడుతాం అంటూ అధికార కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరావు హెచ్చరిం చారు.

ఈరోజు నిర్వహించిన ఛలో నల్లగొండ సభలో కాంగ్రెస్‌ సర్కారు పనితీరుపై మాజీ సీఎం కేసీఆర్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం వచ్చాక కరెంటు తెచ్చాం. ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగు చేసి ఏడాదిన్నర నుంచి 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చాం. మీరంతా సంతోషంగా నడింట్లో పండుకొని పంటలు పండించారు.

పాములు, తేళ్లు కరువంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్‌ గవర్నమెంట్‌ పోంగనే కట్కేసినట్టే బంద్‌ అవుతుందా కరెంటు? నేను తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటు దానికి ఏం రోగం అయ్యింది.. మాయ రోగం వచ్చిందా? యాడపోయే కరెంటు" అంటూ మండిపడ్డారు.

దద్దమ్మల రాజ్యమైతే గట్లనే ఉంటది

దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్లు ఉన్నంత మాత్రాన మనం నర్వస్‌ కావొద్దు. ఎక్కడి కక్కడ మనం నిలదీయాలి.

ఏమైందిరా బిడ్డ నా కరెంటు అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లకుల్లగా చెబుతున్న. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా.. ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామర చర్ల మండలంలో 4వేల మెగాపవర్‌ ప్లాంట్‌ కట్టినం జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో. 90శాతం పనులు పూర్త య్యాయి.

రెండుమూడు నెలలు తిప్పలుపడితే 4వేల మెగావాట్ల పవర్‌ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టిన ఎన్టీపీసీ 800 మెగావాట్ల పవర్‌ వచ్చింది.

ఇంకో 800 మెగావాట్లు రాబోతున్నది. ఆనాడు నడిపిన నాడు ఉన్నదాని కంటే 5600 మెగావాట్ల పవర్‌ కరెంటు ఎక్కువగ ఉండంగ కూడా.. వీళ్లకు ఏం రోగం పుట్టింది.. కరెంటు ఎందుకు ఇస్తలేరు ? ఎందుకు తిప్పలుపెడు తున్నరు ? బిడ్డా ఛలో నల్లగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజార్లలో నిలదీస్తాం" అని స్పష్టం చేశారు.

ప్రజలను ఇబ్బందుల పెడితే బజారులో నిలబెడతాం..

"ప్రజలను కరెంటుకు తిప్పలు పెట్టినా.. నీళ్లకు తిప్పలుపెట్టినా.. మంచి నీళ్లకు తిప్పలుపెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతాం."

మీకు గవర్నమెంట్‌ ఇచ్చారు. మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత ఇచ్చారు.తప్పా.. ఎక్కడి కక్కడ మిమ్మల్ని నిలదీస్తం తప్పా.. వదిలిపెడతాం అనేదాంట్లో ఉండొద్దు. ప్రజలకు అన్యాయం చేయొద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి స్తున్నా..అని కెసిఆర్ ఉన్నారు


#kcr #brs #telangana

Previous మహాశివరాత్రి జాతర ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి
Next ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సదస్సు నిర్వహించారు
ADVERTISEMENT