| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పార్లమెంటులో పాలమూరు వాయిస్ ఎక్కడ..?

పార్లమెంటులో పాలమూరు వాయిస్ ఎక్కడ..?

పాలమూరు ఎంపీ ఓ గంగిరెద్దు..!

బీఆర్ఎస్ ను బొంద పెట్టాం ఇక బిజెపితో లడాయి

పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలి

ఎమ్మెల్యే శంకర్, వంశీచంద్ రెడ్డి మంచి జోడేడ్లు

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎప్పుడైనా మీరు చూసినరా..? కనీసం ఫోటోలో నైనా చూసిండ్రా అంటూనే అసలు షాద్ నగర్ లో గత ఎమ్మెల్యే ఆయన ఫోటోలు ఎక్కడ పెట్టాడు..? "డుడూ బసవన్న"లా ..ఓ గంగిరెద్దును ఎంపీగా పెట్టారని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. పాలమూరు న్యాయ యాత్ర షాద్ నగర్ నియోజకవర్గంలో సోమవారం రెండవ రోజు కొనసాగిస్తున్న సిడబ్ల్యుసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డితో  పాటు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందూర్గు మండలం ఆగిర్యాల, పాత ఆగిర్యాయాల, వెంకిర్యాల తదితర గ్రామాలలో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వీరితోపాటు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తంగేళ్లపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ తీరు తెన్నులను ఎండగట్టారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చిందని, ఆ చిప్ప కూడా మొత్తం నాకిపోయారని అన్నారు. ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్, కూతురు కవిత, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు, ఈ ఐదుగురు  రాష్ట్ర ఖజానాను దోచుకు తిన్నారని విమర్శించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు కుర్చీ వేసుకుని కడతామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమయ్యాడని? ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు నీరు పారిస్తా అన్న కెసిఆర్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. చెంచాడు మట్టి కూడా తీయలేని అసమర్ధుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కడతానని చెప్పిన కేసిఆర్ ఆ కుర్చీని ప్రగతి భవన్ లో పెట్టాడని అన్నారు. అదే కుర్చీని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బొంద పెట్టిందని అన్నారు. ఉన్న టిఆర్ఎస్ పార్టీ పేరును  మార్చుకొని బీఆర్ఎస్ గా మార్చారని ఇప్పుడు అది కూడా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంటులో పాలమూరు గొంతులు వినిపించాల్సిన ఎంపీ డుడు బసవన్నల ఉన్నాడని ఎన్నడైన గ్రామాల్లో అతన్ని చూశారా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి ప్రయోజనం లేదని అన్నారు. పాలమూరు గొంతు వినిపించాలంటే చల్లా వంశీచంద్ రెడ్డి లాంటి యువనేతను ఎన్నుకుంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కూడా లభిస్తుందని అన్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి గంగిరెద్దు అయితే వంశిచంద్ రెడ్డి పొడిచే ఎద్దని పార్లమెంటులో మన హక్కులు పోట్లాడి సాధిస్తాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే కొంతమంది బేకుఫ్ గాళ్లు ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని త్వరలోనే  కేంద్రంలో కాంగ్రెస్  ప్రభుత్వము రాబోతుందనే విషయం మరచిపోతున్నారని అన్నారు. ప్రజల ఖాతాలకు డబ్బులు పంపిస్తామన్న మోడీ ఏమయ్యాడని అన్నారు. మళ్ళీ మోడీ వస్తే ఇక దేశంలో సజావుపాలన కొనసాగదని అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి చేసేందుకు ఎన్నో నిధులు వస్తాయని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే శంకర్ పార్లమెంటులో వంశీచంద్ రెడ్డి ఎంపిక అయితే ఇద్దరు జోడేడ్లలా పనిచేస్తారని పాలన సజావుగా కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్ విధివిధానాలు ప్రజలు గుర్తించారని ఇక ఆ పార్టీకి స్వస్తి పలికి కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం హామీ నెరవేర్చబోతుందని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళల ప్రయాణం, పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డు పూర్తి చేశామని ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు సిలిండర్ త్వరలోనే ఇవ్వబోతున్నామని అన్నారు..

Previous 64 కిలోల గంజాయిని పట్టుకున్న చేవెళ్ల పోలీసులు
Next బి సి లకి బడ్జెట్ లో మొండిచేయి: బీసి విద్యార్థి సంఘాo రాష్ట్ర కో ఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్
ADVERTISEMENT