ప్రభుత్వ విద్యాలయాలలో ఉన్నతమైన సౌకర్యాలు
పరీక్షలంటే భయం వీడాలి
ఇష్టంతో చదవాలి
ఒత్తిడికి గురి కాకూడదు
డైలీ భారత్, మెదక్: విద్యార్థులు భవిష్యత్ పై మంచి ప్రేరణా కల్గి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు.
స్థానిక మెదక్ పట్టణం లోని టీఎన్జీవో భవన్ లో ,శనివారం 10 వ తరగతి బీసీ హాస్టల్ విద్యార్థులకు, వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ మెదక్ ఆధ్వర్యంలో జిల్లాలో లో ఉన్న 22 హాస్టల్ ల నుంచి 222 మంది విద్యార్థులకు ప్రేరణా తరగతులు (motivational classes) నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరైన, ప్రేరణా తరగతులను సావిత్రిబాయి పూలే జ్యోతి బాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన తో కర్యక్రమన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ,10 వ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను మొదటి స్థానం లో ఉంచాలన్నారు.
10 వతరగతి లో విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణా కల్గి ఉండాలన్నారు. పరీక్షలు అంటే భయం వీడాలన్నారు. ఇష్టంతో చదవాలన్నారు .ఒత్తిడికి గురికవోద్దాని పిలుపునిచ్చారు. ఉన్నత చదులవుల కోసం ఉపాద్యాయులు విద్యార్థులకు ప్రేరణా కల్పించాలన్నారు.
ఉన్నాయని,అనుభవమైన ఉపాద్యాయులు తో పాటు అన్ని రకాల పుస్తకాలు , స్నాక్స్ అల్ ఇన్ వన్ లాంటి స్టడీ మెటీరియల్స్ ను, విద్యార్థులకు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు.
హాస్టల్ లో ఉండే విద్యార్థుల కోసం, ప్రత్యేక స్టడీ హావర్స్ ,ప్రత్యేక టుటర్స్ లను నియమించి అనుభవం గల నిపుణులతో ప్రేరణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జీవితం లో మంచి భవిష్యత్ కు పదవ తరగతి కీలకం అన్నారు.
పదవతరగతి లో ఉన్న సబ్జెక్ట్ లను నిర్లక్ష్యం చేయొద్దని,పదవ తరగతి సబ్జెక్ట్ లు కేంద్ర ,రాష్ట్ర స్థాయి లో ఉండే సివిల్స్, గ్రూప్ 1,2,3 లాంటి పరీక్షలు ఉపయోగ పడతాయన్నారు.
పరీక్షలు కొన్ని రోజులే సమయం ఉన్నందున సమయాన్ని వృదా చేయొద్దన్నరు.
టీవీ , ఫోన్ ,సోషల్ మీడియాలో లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఏ బి సి డి గ్రూప్ ల విద్యార్థులను విభజించాలమని , సి, డి గ్రూపు విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పదవ తరగతి విద్యార్థులు సమన్వయము తో చదువు కోవాలన్నారు .
హాస్టల్ లో విద్యార్థులను హాస్టల్ వార్డెన్ లు ,ఉదయం నిద్ర లేపి చదివించాలని, పరీక్షల సమయంలో లో విద్యార్థులను క్రమశిక్షణ గా ఉండేలా వార్డెన్ లు బాధ్యత తీసుకోవాలన్నారు.
10వ తరగతి లో శత శాతం పలితాలు లక్ష్యం గా విద్యార్థులు, ఉపాద్యాయులు పని చేయాలన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 22 బీసీ హాస్టల్ లలో 222 మంది విద్యార్థులు ఈ సం:రానికి పదవతరగతి లో పరీక్షలకు సిద్దంగా ఉన్నారని, విద్యార్థులు అన్ని సబ్జెక్ట్ లలో మంచి మార్కులు వచ్చేలా విషయ నిపుణుల తో ప్రేరణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఉదయం , సాయంత్రం స్నాక్ అందిస్తున్నా మన్నారు.
అంతకు ముందు వివిధ సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థులకు ప్రేరణా తరగతులు బోధించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ లు,పెన్నులు అందించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజు గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ కమీషనర్ వెంకట గోపాల్ , టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ , టీఎన్జీవో జిల్లా
కార్యదర్శి రజ్ కుమార్ , శ్రీనివాస్ , హాస్టల్ వార్డెన్ లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.