అమరవీరుల ఆశిశులతోనే నేను ఈ స్థాయికి వచ్చాను .. బల్మూరి వెంకట్ ..
డైలీ భారత్, హైదరాబాద్: విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా నన్ను సీఎం రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి భట్టి, ఏఐసీసీ అగ్రనాయకులు సభలోకి పంపించారు.
10 ఏళ్లు యువ కులం పక్షాన పోరాటం చేశాను.
ఇప్పుడు ఆ యువ"కులం" సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను.
విద్యార్థులు,యువకులు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొనిరండి ప్రతి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తా అని బల్మూరి వెంకట్ అన్నారు.