జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఆ మాజీ ఎమ్మెల్యే డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటన నేపథ్యంలో బోధన్ నియోజకవర్గం దృష్టి పెట్టనున్నట్లు అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె సంకేతాలు ఇవ్వడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ స్పందించారు. అంతేకాకుండా కవిత పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బోధన్ లో కవిత గాని, సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసినా ఆహ్వానిస్తానని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గతంలో మెదక్ లో పోటీచేసిఇందిరా గాంధీ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పునిస్తారన్నారు. ఇక అప్పటి ఎంపీ ప్రస్తుత టీఆర్ఎస్ చీఫ్ కవితను తాము కలవాలంటే 2 కి.మీ. దూరంలోనే అది ఆమె పీఏలకు డబ్బులిస్తేనే అనుమతిస్తారని షకీల్ ఆరోపించారు. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు బోధన్ నియోజకవర్గం మే జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే గతంలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో ఆమె ఆదేశాల ప్రకారం ఆమె ఏది చెబితే కరెక్టు అన్నట్టుగా నడిచిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆమె పార్టీ వీడి సొంతగా పార్టీ పెట్టి మరీ ముఖ్యంగా కవిత సొంత నియోజకవర్గమైన బోధన్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్నా వార్తల నేపథ్యంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి.
News
టిఆర్ఎస్ చీఫ్ కవితపై సంచలన వ్యాఖ్యలు చేసిన బోధన్ మాజీ ఎమ్మెల్యే