పద్మ శాలి భవన్ లో MSF జిల్లా సదస్సు!
కుల వివక్ష నూతన రూపాల్లో దళితులను పీడిస్తోంది: MRPS నేతలు!
అధ్యక్షులుగా కర్రోళ్ల మహేష్ మాదిగ ఎన్నిక!
మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని విద్యార్థులకు పిలుపు!
డైలీ భారత్, కామారెడ్డి:మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) జిల్లా సదస్సు పద్మ శాలి భవన్ లో MRPS జిల్లా నాయకుడు మావురం శ్రీకాంత్ మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MRPS ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జిలు బోడ సునీల్ మాదిగ, భైరపోగు దుప్పెలి అనిల్ మాదిగ, భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ దేశంలో కుల వివక్ష నూతన రూపాలను సంతరించుకుని దళితులను, పీడితులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
కుల వివక్ష వల్ల దళితులు అన్ని రంగాల్లో అణచివేయబడుతున్నారని, కుల వివక్ష నిర్మూలన కోసం ఎన్నో చట్టాలు రూపొందించిన పాలక వర్గాలు వాటిని నిర్దిష్టంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తే కుల వివక్ష తగ్గుముఖం పట్టేది కానీ నేడు కుల వివక్ష మరింత పెరగడానికి కారణం పాలకుల లోపమే అని అన్నారు.
డా. అంబేద్కర్ రాజ్యాంగంలో అస్పృశ్యతను, అంటరానితనాన్ని, వివక్షతను పూర్తిగా నిషేధించారని, అయినా నేడు అవి ఉనికిలో ఉండడం అత్యంత విచారకరం అని అన్నారు. అందువల్ల నేటి ఆధునిక విద్యార్థి లోకం ప్రథమ కర్తవ్యం కుల వివక్ష నిర్మూలననే కావాలని అన్నారు.
కుల వ్యవస్థ విసిరే సవాళ్లను ఎదుర్కొని వివక్షతలను అధిగమించి జీవిత లక్ష్యాలను సాధించుకునే విధంగా సంకల్ప బలాన్ని మాదిగ విద్యార్థులు పెంచుకోవాలని అన్నారు. గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే దంపతులు, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్, మంద కృష్ణ మాదిగ వంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని విద్యార్థులను కోరారు.
కుల మత వర్గ లింగ వివక్ష లేని, సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మంద కృష్ణ మాదిగ నడిపే భవిష్యత్ పోరాటాల్లో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
MSF నూతన కామారెడ్డి జిల్లా కమిటీ వివరాలు:
అధ్యక్షులు: కర్రోళ్ల మహేష్ మాదిగ
ప్రధాన కార్యదర్శి: శంకంపల్లి మాణిక్ మాదిగ
అధికార ప్రతినిధులు: గోసే సతీష్ మాదిగ, తాటికొండ స్వామి మాదిగ
ఉపాధ్యక్షులు: సలుడే రితీష్ మాదిగ, మెత్రి సాయి మాదిగ
కార్యదర్శులు: సింగడప్ప శ్రీకాంత్ మాదిగ, నాయిని రామకృష్ణ మాదిగ, సతీష్ మాదిగ
ప్రచార కార్యదర్శులు: రామగాళ్ల శ్రీకాంత్ మాదిగ, తంగేళ్ల సాయి కిరణ్ మాదిగ
కార్యవర్గ సభ్యులు: నరేష్ మాదిగ, జోగు నవీన్ మాదిగ, సంగేం జశ్వంత్ మాదిగ
మరికొంత మంది విద్యార్థులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MRPS మహిళా రాష్ట్ర కార్యదర్శి సత్తిగారి లక్ష్మి మాదిగ, MRPS నాయకులు వెంకట్రామ్ మాదిగ, లావణ్య మాదిగ, యాదగరి మాదిగ, బాలరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
MRPS, MSP అన్ని మండలాల అధ్యక్షులు, ఇంచార్జిలు, మాదిగ విద్యార్థులు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#DailyBharath #Kamareddy #MSF