| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు! కామారెడ్డిలో ఆటోలపై రవాణా శాఖ స్పెషల్ తనిఖీలు!

పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు! కామారెడ్డిలో ఆటోలపై రవాణా శాఖ స్పెషల్ తనిఖీలు!

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం!

పరిమితికి మించి పిల్లలతో నడిపిన ఆటోలు గుర్తింపు!
గత మూడు రోజులుగా చట్టపరమైన చర్యలు!
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయి: అధికారులు!

డైలీ భారత్, కామారెడ్డి:జిల్లాలో ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాలపై విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా కామారెడ్డి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి పిల్లలతో నడుస్తున్న పలు వాహనాలను గుర్తించారు. సహాయక మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్లు ఉదయ్ కుమార్, కృష్ణ తేజ సంబంధిత వాహనాలపై గత మూడు రోజులుగా చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన మరియు అనుమతులున్న వాహనాలలోనే ప్రయాణిస్తున్నారా అన్న విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మోటార్ వాహన చట్టం ప్రకారం ఈ రూల్స్ పాటించవలెను:

1. ఒక 4 సీటర్ ఆటో రిక్షాలో ఆరుగురు పిల్లలు (12 సంవత్సరాల కంటే తక్కువ) మాత్రమే పరిమితి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం విధించబడింది.

2. స్కూల్ పిల్లల బ్యాగ్ లు బండి బయటకు రాకుండా బండి లోపల సర్దుబాటు చేయాలి.

3. సేఫ్టీ గ్రిల్స్ విధిగా బిగించి సురక్షితముగా తీసుకెళ్లవలెను.

జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

#DailyBharath #Kamareddy

Previous కుల వివక్ష నిర్మూలనే విద్యార్థుల ప్రథమ కర్తవ్యం! MSF కామారెడ్డి నూతన జిల్లా కమిటీ ఎన్నిక!
ADVERTISEMENT