డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో మహా సేన రాజకీయ గ్రామ సేవ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జజ్జరి సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు గంభీరావుపేట్ మండలం గజసింగవరం గ్రామంలో గ్రామ సేవ సంఘ్ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ గ్రామాలలో గ్రామాల అభివృద్ధికి పాటుపడే సంఘాలు లేవని అన్నారు. ప్రతి గ్రామం అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే గ్రామంలోని యువతీ యువకులు గ్రామ అభివృద్ధికి వచ్చే తరానికి మంచి భవిష్యత్తు అందించాలంటే చదువుకున్న యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎవరో వస్తారు, ఎవరో వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అని కలలు కనడం మానేసి మన గ్రామం మన భవిష్యత్తు అనే నినాదంతో ముందుకు రావాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ సేవ చేయడానికి, గ్రామంలోని అన్ని రంగాలను ముందుకు తీసుకుపోయే విధంగా గ్రామ యువత ముందడుగు వేయాలని అన్నారు. యువత తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదని, మీకు మేమున్నామని భరోసా ఇస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రామాల వారీగా కమిటీలను వేస్తూ గ్రామాల అభివృద్ధికి గ్రామ సేవా సంఘం ముందుంటుందని తెలిపారు.
కొత్తగా నియమితులైన కమిటీ:
గ్రామ అధ్యక్షుడిగా బెజుగాం మహేష్
ఉపాధ్యక్షుడిగా బోయిని బాలయ్య
ప్రధాన కార్యదర్శిగా జాలపల్లి రాములు
కార్యదర్శిగా దుంపటి సుధాకర్
జిల్లా కమిటీ సభ్యులుగా రాయలింగు అశోక్, రామడుగు నవీన్
మండల కమిటీ సభ్యులుగా దుబ్బాక బాలరాజు, పంతం శ్రీనివాస్
గ్రామ కమిటీ కార్యవర్గ సభ్యులుగా బడుగు భూమయ్య, జీడి చంద్రం, బోయిని సాగర్, జజ్జరి నర్సయ్య, అక్రోజ్ బాలయ్య, జలపల్లి రవి, బోయిని సాయి కుమార్, MD షారు ఖాన్, B గణేష్, పోతూ శ్రవణ్, B తరుణ్, సత్రావేణి శ్రీకాంత్, రామడుగు రాజు
వీరిని నియమించడం జరిగింది.
#DailyBharath #MahaSena #Gajasingavaram #Sircilla