డైలీ భారత్, హైదరాబాద్:సమిష్టి కృషితోనే డ్రగ్ ఫ్రీ సొసైటీ సాధ్యమని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర మూడో రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేరింది.
శుక్రవారం మైత్రీవనం వద్ద పాదయాత్రలో పాల్గొని కిషన్ రెడ్డి సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కీర్తిరెడ్డి పాఠశాల విద్యార్థులు, స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డ్రగ్స్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు.
భావితరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి డ్రగ్స్ ఫ్రీ సొసైటీ అని కీర్తిరెడ్డి అన్నారు. మూడో రోజు మైత్రీవనం వద్ద యాత్రలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేలా ప్రతిజ్ఞ చేశారు.
స్పెషల్ ఎట్రాక్షన్ గా:
నషా ముక్త్ భారత్ పాదయాత్రలో భాగంగా కీర్తిరెడ్డి పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులలో నయా జోష్ నింపారు. పాదయాత్రలో భాగంగా డప్పు వాయిస్తూ స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాదయాత్రకు అనూహ్య స్పందన:
మంచి సొసైటీ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఈ నషా ముక్త్ భారత్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలుపుతున్నారు.
కీర్తిరెడ్డి కామెంట్స్:
భారత దేశానికి యువతే గొప్ప సంపద
అలాంటి యువతను టార్గెట్ గా చేసుకుని కొన్ని విదేశీ శక్తులు డ్రగ్స్ కు అలవాటు చేసే కుట్రలు చేస్తున్నాయి
ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఈ నషా ముక్త్ భారత్ కు పిలుపు ఇచ్చారు
అసాధ్యం అనుకున్న పనులన్నీ సుసాధ్యం చేసి చూపిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే
చాలా చెప్పాం.. చేశాం.. ఇదీ చేసి తీరుతాం:
నషా ముక్త్ భారత్ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కీర్తిరెడ్డి. గతంలో 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, కామన్ సివిల్ యాక్ట్, నక్సల్స్ ఫ్రీ భారత్ చేసి చూపినట్లే ఈ దేశంలో డ్రగ్స్ మూలాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
సమిష్టి కృషితోనే సాధ్యం:
నషా ముక్త్ భారత్ నిర్మాణం ఏ ఒక్క పోలీసులు, పొలిటీషన్ల వల్లనో సాధ్యం కాదని ప్రజలు తమవంతు బాధ్యతగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా డ్రగ్స్ వాడకం, సప్లై ని అరికట్టగలిగినప్పుడే నషా ముక్త్ భారత్ సాధించుకోగలుగుతామని అన్నారు. అందుకే మన భావితరాలు బాగుండాలన్న ప్రధాని మోదీ విజన్ కు మనమంతా అండగా నిలిచినప్పుడే నషా ముక్త్ భారత్ సాధ్యపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విజన్ లో కలిసి రావాలని పిలుపునిచ్చారు కీర్తిరెడ్డి.
#DailyBharath #KeerthiReddy #KishanReddy #NashaMuktBharat #Hyderabad