| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీలో 164 మంది విదేశీయులతో సైబర్ మోసం! భారీ అంతర్జాతీయ ముఠా బస్ట్!

ఢిల్లీలో 164 మంది విదేశీయులతో సైబర్ మోసం! భారీ అంతర్జాతీయ ముఠా బస్ట్!

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అంతర్జాతీయ సైబర్ ఫ్రాడ్ నెట్ వర్క్ ను బస్ట్ చేసింది. అక్రమ నిర్బంధంలో ఉంచి బలవంతంగా సైబర్ మోసాలకు పాల్పడేలా చేస్తున్న 164 మంది విదేశీయులను రక్షించింది. ఈ కేసులో ఒక మలేషియా జాతీయుడిని అరెస్ట్ చేసింది.

రక్షించబడిన వారిలో 92 మంది ఇండోనేషియా, 72 మంది మలేషియా దేశాలకు చెందిన వారు ఉన్నారు. వారి నుంచి 549 డిజిటల్ పరికరాలు, 174 పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశీయులను మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భారతదేశానికి తీసుకొచ్చి నిర్బంధించారు. నకిలీ మహిళల పేర్లతో సోషల్ మీడియా ప్రొఫైల్స్ సృష్టించి బాధితులతో ఆన్ లైన్ లో స్నేహం చేశారు. ఆ తర్వాత నమ్మించి Zenttrix, Quantvoro వంటి నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ లు, APK యాప్ లలో పెట్టుబడి పెట్టేలా మోసం చేశారు

ఇంటర్ స్టేట్ సెల్, క్రైమ్ బ్రాంచ్ ఢిల్లీ పోలీసులు పక్కా సమాచారంతో టార్గెటెడ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 355 మొబైల్ ఫోన్లు, 168 డెస్క్ టాప్ లు, 26 ల్యాప్ టాప్ లు, 53 సిమ్ కార్డులు, 174 పాస్ పోర్టులు, ఇతర డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్ స్పెషల్ కమిషనర్ క్రైమ్ HGS ధలివాల్ IPS పర్యవేక్షణలో జరిగింది.

దర్యాప్తులో భారతీయ హ్యాండ్లర్ల ప్రమేయం, అద్దె మరియు నిర్వహణ ఖర్చుల కోసం వాడిన బ్యాంక్ ఖాతాల గురించి బయటపడింది. ఫైనాన్షియల్ ట్రయల్స్, డిజిటల్ ఆధారాలను పరిశీలించి విస్తృత అంతర్జాతీయ నెట్ వర్క్ ను, నేరం ద్వారా వచ్చిన డబ్బును గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

#DailyBharath #DelhiPolice #CrimeBranch #CyberFraud

Previous ఖైరతాబాద్ GHMC ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం! అకౌంట్స్ సెక్షన్ లో మంటలు!
Next తమిళనాడులో పురుష ఉద్యోగులకు గుడ్ న్యూస్! 15 రోజుల పెటర్నిటీ లీవ్!
ADVERTISEMENT