| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రగతి సాధించేందుకు లక్ష్యంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ప్రగతి సాధించేందుకు లక్ష్యంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: ప్రగతి సాధించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు లక్ష్యంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, పంచాయతీల లో పన్నుల వసూళ్లు దగ్గర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ముందుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సంబంధిత జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తో కలిసి కూలి పనుల ప్రగతిపై సమీక్షిస్తూ కూలీల సంఖ్య పెరగాలన్నారు.

కూలి పనుల ప్రగతిలో వెనుకబడిన మండలాలైన పెద్దవంగర తొర్రూరు మరిపెడ మండలాల ఎంపీడీవోలను ఆదేశిస్తూ లక్ష్యాలు సాధించా లన్నారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు రోజువారి నివేదికలు అందించాలన్నారు.

ఆధార్ కు కేవైసీ లింకు చేయడంలో కేసముద్రం గార్ల మండలాలు వెనుకబడి ఉన్నాయని ప్రగతి సాధించాలన్నారు.

సీసీ రోడ్లు 20 చేపట్టడం జరిగిందని త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామ పంచాయతీలు ఇతర పన్నులతో ఇంటి పన్నుల వసూళ్లు 100% సాధించాలన్నారు.

గ్రామాలలో ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా శానిటేషన్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి కవర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటూ విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

తాసిల్దార్ లో ఎంపీడీవోలు రోజువారీగా వసతి గృహాలు పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలు తనిఖీలు చేపట్టాలన్నారు.

మండల పనితీరుపై ఉన్నతాధికారులు నివేదికలను ఇవ్వాలన్నారు.

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధానంగా శానిటేషన్ కారణమన్నారు అదేవిధంగా విద్యార్థులలో గర్భిణీ స్త్రీలలో పౌష్టికాహార లోపాన్ని సరి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Previous మరో సీఐ సస్పెండ్
Next ఓటర్ల జాబితా పటిష్టంగా చేపట్టాలి :ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి
ADVERTISEMENT