| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మరోసారి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించండి

మరోసారి మోడీ  ప్రభుత్వాన్ని గెలిపించండి

ఇంటింటికి మోడీ  పథకాలను తీసుకెళ్లండి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

"గావ్ ఛలో-ఘర్ ఛలో" కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య పిలుపు

షాద్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్యలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఎబి కాంప్లెక్స్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ అధ్యక్షతన షాద్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య వెంకటేష్ గుప్త, వంశీ కృష్ణ, మోటే శ్రీనివాస్, అసెంబ్లీ విస్తారక్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న "గావ్ ఛలో-ఘర్ ఛలో" కార్యక్రమం లో భాగంగా గత పదేళ్లలో మోడీ దేశంలోని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ఇంటింటికి తీసుకెళ్లాలని అన్నారు.

దేశ అభివృద్ధి, పేదల అభివృద్ధి, రైతుల సాధికారత బిజెపి తోనే సాధ్యమని, కాబట్టి మరోసారి మోడీ గారి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, వందే భారత్ రైళ్లు ఇలా తెలంగాణా లో అనేక అభివృద్ధి పనులు చేసారని అన్నారు. మరో సారి అవకాశం ఇస్తే రాబోయే ఇదేళ్లలో వెయ్యి సంవత్సరాలకు గుర్తుండిపోయే పాలనను అధిస్తానని మాట్లాడిన మోడీ  గ్యారంటీని గుర్తుచేసారు.

మరియు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 20న ప్రారంభమయ్యే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంట్ల క్లస్టర్ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అందె బాబయ్య మాట్లాడుతూ గత పదేళ్లలో మోడీ గారి నాయకత్వంలో దేశం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలిపిస్తేనే, తెలంగాణ అభివృద్ధి పనులకు 9లక్షల కోట్ల పై చిలుకు మోడీ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఈసారి 10 కి పైగా గెలిపించాలని అన్నారు.

దేశం అభివృద్ధి మోడీ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో

మండల అధ్యక్షులు దొడల వెంకటేష్ యాదవ్, బోయ కురుమయ్య, కొమరబండ శ్రీశైలం ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు వివిధ మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు....

Previous సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు... తిరుమల తరహాలో విఐపి బ్రేక్ దర్శనం
Next మరో సీఐ సస్పెండ్
ADVERTISEMENT