డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) సంయుక్తంగా ఆకాంక్షిత మండలాల కార్యక్రమం కింద జపాన్ లో నిర్వహించిన అధ్యయన పర్యటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ IAS విజయవంతంగా పూర్తి చేశారు! నవంబర్ 15 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ పర్యటన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ధ్రువపత్రాన్ని అందుకున్నారు!
టొయోటామా స్కూల్ నుంచి నేర్చుకున్న పాఠాలు:
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ అంకిత్ IAS తన బృందంతో కలిసి నెరిమా నగరంలోని టొయోటామా ప్రాథమిక పాఠశాల నుంచి నేర్చుకున్న పాఠాలు అనే అంశంపై సాంకేతిక, విధానపరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు! పాఠశాల సందర్శన సందర్భంగా పరిశీలించిన విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ అంశాలను వివరించారు! జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు అనుసరించదగిన విధానాలపై చర్చించారు!
స్థానిక పాలన, సేవలపై అధ్యయనం:
స్థానిక పాలన, ప్రజలకు ప్రభుత్వ సేవల అందజేత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై నిర్వహించిన అధ్యయన సమావేశాలు, క్షేత్రస్థాయి సందర్శనల్లో కలెక్టర్ పాల్గొన్నారు! మిటో నగరంపై నిర్వహించిన కేస్ స్టడీ ద్వారా స్థానిక సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సేవలు అందిస్తున్న తీరును అధ్యయనం చేశారు! సోనీ సంస్థపై నిర్వహించిన కేస్ స్టడీలో సంస్థాగత మార్పుల అమలు, పనితీరు మెరుగుదలలో నాయకత్వ పాత్రకు సంబంధించిన అంశాలను పరిశీలించారు!
జిల్లాకు ఏం లాభం:
జపాన్ పర్యటనలో అధ్యయనం చేసిన ఉత్తమ విధానాల్లో జిల్లాకు అనువైన అంశాలను గుర్తించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయనుంది! ముఖ్యంగా ఆకాంక్షిత మండలాల్లో విద్య, ఆరోగ్యం, పోషణ రంగాల్లో సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ అధ్యయన పర్యటనలో పొందిన అనుభవాలు, సూచనలు ఉపయోగపడనున్నాయి! అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాలను జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలగనుంది!
#DailyBharath #BhadradriKothagudem #CollectorAnkit #IAS #JICA #Japan #NITI Aayog #AspirationalBlocks #Education #Health