| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాహుల్ గాంధీ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సోమ‌వారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రెండు గ్యారంటీలు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితి ని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల‌కు పెంచి అమ‌లు చేస్తున్న తీరును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివ‌రించారు. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న తీరును రాహుల్ గాంధీకి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఉన్నారు.

Previous బాల్క సుమన్ పై ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు ధ్వజం
Next నిరసనలో నిరసనలు
ADVERTISEMENT