| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏపీలో ఈవెనింగ్ కోర్టులు.. పెండింగ్ కేసుల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం!

ఏపీలో ఈవెనింగ్ కోర్టులు.. పెండింగ్ కేసుల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం!

డైలీ భారత్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఈవెనింగ్ కోర్టులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈవెనింగ్ కోర్టులను ప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రతిపాదిత విధానం ప్రకారం.. ప్రస్తుతం పగటిపూట సాధారణ పని వేళల్లో పనిచేస్తున్న న్యాయస్థానాలు సాయంత్రం వేళల్లో మరికొన్ని గంటల పాటు అదనంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

సంబంధిత హైకోర్టుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించి, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈవెనింగ్ కోర్టుల ప్రధాన లక్ష్యంగా కేంద్రం భావిస్తోంది.

ఈవెనింగ్ కోర్టులతో పాటు న్యాయవ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇతర ప్రత్యామ్నాయ యంత్రాంగాలపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Previous దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట.. డిసెంబర్‌లో ప్రారంభం!?
Next హైదరాబాద్‌లో సంచలనం... HYDRAA కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు హాజరుపరచాలని DGPకి హైకోర్టు ఆదేశం!
ADVERTISEMENT