| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశ స్వాతంత్ర పోరాటంలో మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాత్ర ఎంతో కీలకం

దేశ స్వాతంత్ర పోరాటంలో మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాత్ర ఎంతో కీలకం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఆయన  మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఆయన జైలులో ఉన్నప్పుడు ఆయన సతీమణి మరణించిన సమయంలో బయటకు రాకుండా బ్రిటిష్ వారి దగ్గర తక్కువకాకుండా  అంత్యక్రియల్లకు కూడా రాణి గొప్ప దేశభక్తుడాన్ని అన్నారు. ఆయన విద్యా రంగంలో తెచ్చిన ఎన్నో మార్పుల ద్వారా విద్యా రంగం అభివృద్ధి చెందింది అన్నారు. అబుల్ కలాం  ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

Previous అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత...
ADVERTISEMENT