డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు నవీపేట ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ పవన్ కుమార్ బుధవారం తెలిపారు. నిజామాబాద్ నుంచి ధర్మాబాద్ కు పిడిఎస్ బియ్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ పవన్ కుమార్, నవీపేట పోలీసులతో కలిసి బాసర ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఓ బొలెరో వ్యాన్ లో 38 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఇందులో ఒక బోలోరే వాహనం, అలాగే డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని నవీపేట పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఆయన తెలిపారు.
News
అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత...