| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యూఏఈ లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి

యూఏఈ లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి

జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దుబాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని వేల్పుల విజేత తెలిపారు. బుధవారం ఆమే ఓ ప్రకటన విడుదల చేశారు. యూఏఈ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం టామ్ కామ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విమాన టికెట్, వసతి, భోజనం కల్పిస్తున్నట్లు వివరించారు. 22 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జనరల్ హెల్పర్స్ కు 27,080/- వడ్రంగి 34,830/-, స్టీల్ ఫిక్సర్లు 34,830/-, మేస్త్రి లకు 34,830/- రూపాయల వేతనంతో  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

Previous కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం... SBI ఏటీఎంలో చోరీకి యత్నం... అలారం మోగడంతో పరారైన దుండగుడు!
Next క్రీడల్లో గెలుపోటములు సహజం... ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం...రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ADVERTISEMENT