| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హోంగార్డు కూతురి అద్భుతం! రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం.. జాతీయస్థాయికి ఎంపిక!

హోంగార్డు కూతురి అద్భుతం! రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం.. జాతీయస్థాయికి ఎంపిక!

హోంగార్డు ప్రోత్సాహం.. కుమార్తె ప్రతిభకు పతకం!

డైలీ భారత్, కామారెడ్డి: రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో సదాశివనగర్ హోంగార్డు కుమార్తెకు కాంస్య పతకం.. జాతీయస్థాయికి అర్హత. అక్షితతో పాటు ఆమె తండ్రి హోంగార్డు పెరమ్ స్వామిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ.

70వ రాష్ట్రస్థాయి SGFI షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన పెరమ్ అక్షిత.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధన.

కుమార్తె క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తండ్రి పెరమ్ స్వామి కృషిని అభినందించిన జిల్లా ఎస్పీ.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న HG-530 పెరమ్ స్వామి కుమార్తె పెరమ్ అక్షిత 70వ రాష్ట్రస్థాయి SGFI షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.

పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పెరమ్ స్వామి, తన కుమార్తెలోని క్రీడా ప్రతిభను గుర్తించి, ఆమె ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సాహం అందించారు. తండ్రి అందించిన ప్రోత్సాహానికి తన కృషి, పట్టుదలను జోడించిన అక్షిత రాష్ట్రస్థాయిలో పతకం సాధించి జాతీయస్థాయికి అర్హత సాధించడం విశేషం.

ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి అక్షితను, ఆమె తండ్రి హోంగార్డు పెరమ్ స్వామిని ఆహ్వానించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ తన కుమార్తెలోని క్రీడా ప్రతిభను గుర్తించి, ఆమె లక్ష్య సాధనకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్న పెరమ్ స్వామి కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల్లోని ఆసక్తి, ప్రతిభను గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు తమకు నచ్చిన రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.

అక్షిత సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగతా పిల్లలు కూడా తమలోని ప్రతిభను గుర్తించి, క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ అక్షిత మరింత ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రులకు, కామారెడ్డి జిల్లాకు, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

#DailyBharath #Kamareddy #ShootingChampionship #PeramAkshitha #HomeGuard #SPRajeshChandra #TelanganaSports

Previous క్రీడల్లో గెలుపోటములు సహజం... ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం...రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
Next సూర్యాపేటలో గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు! ప్రమాదాలకు చెక్!
ADVERTISEMENT