| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైలు ప్రమాదం...! కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ బోల్తా! ప్రయాణికులంతా సేఫ్!

రైలు ప్రమాదం...! కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ బోల్తా! ప్రయాణికులంతా సేఫ్!

డైలీ భారత్, గువహటి:గువహటి సమీపంలో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం.13125) గువహటికి సుమారు 44 కి.మీ దూరంలో ఉన్న దిగారు స్టేషన్ దగ్గర పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందలేదు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఉదయం సుమారు 6:54 గంటలకు దిగారు స్టేషన్‌లో మరో రైలుకు దారి ఇచ్చేందుకు ఈ రైలును మళ్లిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) CPRO కపింజల్ కిషోర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, లోకో పైలట్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఇంజిన్‌తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి.

స్థానికంగా బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని చెబుతున్నా, ఖచ్చితమైన కారణం విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు - రైళ్లకు అంతరాయం

సీనియర్ రైల్వే అధికారులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, నీరు అందించి ప్రత్యేక రిలీఫ్ ట్రైన్ ద్వారా తరలించారు. ప్రధాన లైన్‌లో రైలు రాకపోకలు పునరుద్ధరించారు.

కొన్ని సర్వీసులపై ప్రభావం పడింది. అలీపూర్‌ద్వార్ జంక్షన్ - మరియాని జంక్షన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మధ్యలోనే నిలిపివేశారు. గువహటి - హైబర్‌గావ్ DMU రద్దు చేశారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు

రైల్వే శాఖ పలు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసింది:

గువహటి: 0361-2731621, 0361-2731622, 0361-2731623

లండింగ్:

03674-263858, 03674-265958, 03674-263831

బదర్‌పూర్: 03843-269546, 03843-269548, 03843-268424, 03843-269547

సిల్చార్: 03842-245414, 03842-245419, 03842-245423

న్యూ జల్పై గురి (NJP): 6287699880

కటిహార్: 9002041806, 9002041952, 9771441956

సీల్దా / కోల్‌కతా: 033-23509643, 033-23833326

#DailyBharath #TrainAccident #KolkataSairangExpress #Guwahati #Assam #IndianRailways #Derailment

Previous ప్రకృతి అద్భుతం! శబరిమల మార్గంలో భక్తులకు దారి సుగమం చేసిన గజరాజు
Next కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం... SBI ఏటీఎంలో చోరీకి యత్నం... అలారం మోగడంతో పరారైన దుండగుడు!
ADVERTISEMENT