| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉద్యమకారులకు అన్యాయం చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం : పామేన భీమ్ భారత్

ఉద్యమకారులకు అన్యాయం చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం : పామేన భీమ్ భారత్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉద్యమకారులకు అన్యాయం చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం అని పామేన  భీమ్ భారత్ అన్నారు . చేవెళ్ల కేంద్రంలో కెజిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ  ఉద్యమకారుల తరుపున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ లో ముఖ్య అతిథిగా హాజరైన చేవెళ్ళ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్. ఈ కార్యక్రమంలో భీమ్ భారత్ మాట్లాడుతు కాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారెంటీల లో తెలంగాణ ఉద్యమకారులకు ,అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం,ఇస్తామని మాటఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి  నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను... అనంతరం  అమర వీరులకు 

జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అద్యక్షుడు డా.చీమ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ యాలాల మహేశ్వర్ రెడ్డి , పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ,పీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ళ సర్పంచ్ ఆగి రెడ్డి , పిఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట రెడ్డి, చేవెళ్ళ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి ,పెంటయ్య , ఎంపీటీసీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు...

Previous వేములవాడలో ఘనంగా మున్నూరు కాపు నిత్యన్న దాన సత్రం వార్షికోత్సవం
Next తెలంగాణలో బిజెపి అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుంది : బానోతు విజయలక్ష్మి
ADVERTISEMENT