Posted on 2026-08-22 14:25:12
త్వరలోనే కళాశాలలో పీజీ తరగతుల ఏర్పాటుకు కృషి
కళాశాలను రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం..... వెటర్నరీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో నూతన భవన ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా దొడ్ల డైరీ సంస్థ సహకారంతో రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని పశువైద్య కళాశాల వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ.. నూతన భవన నిర్మాణానికి దొడ్ల డైరీ వారి సహకారంతో 6.5 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం పూర్తి చేసి మాకు అప్పగించిన సందర్భంగా దొడ్డ డైరీ ఎండి సునీల్ రెడ్డి సీఈవో బివికే రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.డైరీ టెక్నాలజీ విద్యను అభ్యసించిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉజ్వల అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కళాశాలను ఉన్నతమైన ప్రమాణాలతో తీర్చిదిద్ది ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే పీజీ తరగతులను ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే ఏకైక డైరీ కళాశాల అన్ని అంగులతో ఏర్పాటు చేశామన్నారు. అనంతరం దొడ్ల డైరీ చైర్మన్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేశామన్నారు. దీంతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు దొడ్ల డైరీ ఎప్పటికే కృషి చేస్తుందన్నారు.
కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం సుమారు 40 దేశాల్లో స్థిరపడి ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని సునీల్‌రెడ్డి తెలిపారు. కళాశాలను అన్ని హంగులతో అభివృద్ధి చేయడంతో పాటు తరగతి గదులను విస్తరించి మరింత మంది విద్యార్థులకు డైరీ టెక్నాలజీ విద్యను అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.
దేశ, విదేశాల నుంచి ప్రత్యేకంగా తరలివచ్చి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. భవిష్యత్తులో కళాశాలను మరింత సుందరంగా, ఆధునిక వసతులతో తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారం అందించాలని, అవసరమైన నిధులు సమకూర్చి రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలతో డైరీ టెక్నాలజీ కళాశాలను తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతామని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దొడ్ల డైరీ సీఈఓ బీవీకే రెడ్డి, పశు వైద్య కళాశాల రిజిస్టర్ డాక్టర్ శరత్‌చంద్ర, కళాశాల తొలి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, ప్రొఫెసర్లు రాజారత్నం, హనుమంతరావు, భాస్కర్‌రెడ్డి, కిషన్‌కుమార్, కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, ప్రొఫెసర్ ఉమాపతి, స్వర్ణలత, అధ్యాపక బృందం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఏకాభిప్రాయంతో నేటి నుండి కొత్త EHS పథకం అమల్లోకి
Posted On 2026-08-22 15:24:13
Readmore >
ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-08-22 14:51:17
Readmore >
హైదరాబాద్ : మాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల కట్టడం.. ఇద్దరు కూలీలు మృతి!
Posted On 2026-08-22 14:50:15
Readmore >
డైరీ కళాశాలలో ఖాళీలను భర్తీ చేస్తాం...రూ.6.50 కోట్లతో నూతన భవనం ప్రారంభం
Posted On 2026-08-22 14:25:12
Readmore >
యాదాద్రి ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం... రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవదహనం, 9 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-22 08:07:51
Readmore >