| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా చిలువేరి మారుతి

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా చిలువేరి మారుతి

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్ చిలువేరి మారుతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదుగురికి మాత్రమే ప్రభుత్వం నామినేటెడ్ సభ్యులుగా అవకాశం కల్పించగా, అందులో కామారెడ్డి జిల్లా నుండి చిలువేరి మారుతికి చోటు దక్కడం జిల్లా వాసులందరికీ గర్వకారణంగా నిలిచింది.

ఫార్మసీ రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను, అనుభవాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది.

ఈ సందర్భంగా చిలువేరి మారుతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, తనకు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మసీ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఆయన నియామకం పట్ల పలువురు ప్రముఖులు, ఫార్మసిస్ట్ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Previous యాదాద్రి ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం... రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవదహనం, 9 మందికి తీవ్ర గాయాలు!
Next డైరీ కళాశాలలో ఖాళీలను భర్తీ చేస్తాం...రూ.6.50 కోట్లతో నూతన భవనం ప్రారంభం
ADVERTISEMENT