కానిస్టేబుల్ డిస్మిస్
సూర్యాపేట జిల్లా మోతే దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ షరీఫ్‌ను ఎస్పీ నరసింహ డిస్మిస్ చేశారు.
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసులో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను పోలీస్ ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయ భూమిలో దంపతుల మృతదేహాలు పాతిపెట్టిన ఘటనపై కేసు నమోదు చేసి, కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేయడంతో పాటు, DSP స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించారు. త్వరగా న్యాయం జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Suryapet Police, Mothe Murder Case, SP Narasimha IPS, Constable Dismissed