| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

రూ. 13 వేలు ఫోన్ పే చేయించుకుంటూ దొరికిపోయిన అధికారిణి..

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్...లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

డైలీ భారత్, మంచిర్యాల:ఇంటి నిర్మాణం, ఇంటి నంబర్ కేటాయింపు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఎసిబి అధికారులకు చిక్కారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మి, కొత్తగా నిర్మించిన ఇంటికి అనుమతి, నంబర్ కేటాయించడం కోసం బాధితుడి నుంచి రూ.20,000 డిమాండ్ చేశారు. చివరకు రూ.13,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. నగదు రూపంలో కాకుండా మరొక పంచాయతీ కార్యదర్శి లావణ్య ఫోన్ పే నంబర్‌కు ఆ మొత్తాన్ని బదిలీ చేయాలని సూచించారు. బాధితుడు ఆ డబ్బును ఫోన్ పే ద్వారా పంపించగా, లంచం డిమాండ్ చేసిన ఆధారాలతో సహా ఆదిలాబాద్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Previous సినీ లోకంలో తీరని శోకం! శ్వాసకోశ సమస్యలతో కన్నుమూసిన మహానటి "షావుకారు" జానకి...
Next మోతే దంపతుల హత్య కేసులో సంచలన చర్య... కానిస్టేబుల్ డిస్మిస్
ADVERTISEMENT