| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోబోటిక్ సర్జరీతో 2 రోజుల్లో నడక... కామారెడ్డి రైతుకు యశోద ఆసుపత్రిలో కొత్త జీవితం

రోబోటిక్ సర్జరీతో 2 రోజుల్లో నడక... కామారెడ్డి రైతుకు యశోద ఆసుపత్రిలో కొత్త జీవితం

డైలీ భారత్, కామారెడ్డి: ఆరు సంవత్సరాలుగా మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కామారెడ్డి జిల్లా వడ్లూరు గ్రామానికి చెందిన పెంటా గౌడ్‌కు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.

కామారెడ్డి యశోద హాస్పిటల్ సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణులు డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే ఈ విషయాన్ని తెలిపారు.

మోకాళ్ల నొప్పితో కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న పెంటా గౌడ్ కామారెడ్డి యశోద సెంటర్‌ను సంప్రదించారు. పూర్తి పరీక్షల అనంతరం ఆయనను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రిఫర్ చేశామని డాక్టర్ తెలిపారు. అక్కడ రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

శస్త్రచికిత్స తర్వాత కేవలం 2 రోజుల్లోనే పెంటా గౌడ్ నడవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజువారీ పనులు చేసుకోవడంతో పాటు బయటకు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వైద్యులు చెప్పారు.

"గత 6 ఏళ్లుగా నొప్పి వల్ల చిన్న పనులు కూడా చేసుకోలేకపోయేవాడిని. డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే గారి ఆధ్వర్యంలో రోబోటిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్‌గా నడుస్తున్నాను" అని పెంటా గౌడ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్‌లో మరింత ఖచ్చితత్వం వస్తుందని, రికవరీ కూడా చాలా వేగంగా ఉంటుందని డాక్టర్ విక్రమ్ గౌడ్ బైరే అన్నారు. మోకాళ్ల సమస్యలున్న వారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.

#Kamareddy #YashodaHospital #RoboticSurgery #KneeReplacement #TelanganaNews

Previous దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య
Next అసలు నెయ్యి అనుకున్నారా? అదంతా కల్తీనే... హైదరాబాద్‌లో 36 టన్నుల నెయ్యి పట్టివేత
ADVERTISEMENT