| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

News

Posted on 2026-08-19 10:09:20

Share: Share


ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

భవన నిర్మాణ అనుమతికి లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

డైలీ భారత్, హైదరాబాద్:ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చార్మినార్ జోన్‌కు చెందిన ఈ మేరకు సంతోష్‌నగర్ సర్కిల్-25 అధికారిణి సీహెచ్ ప్రభావతిని ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవన నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌ను ప్రాసెస్ చేసి, సంబంధిత భవన నిర్మాణ అనుమతి ఉత్తర్వుతో పాటు పని ప్రారంభ లెటర్ అందించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానికి ఉంది. అయితే ఈ పని పూర్తి చేసేందుకు ప్రభావతి సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

లంచం డిమాండ్ ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్వేశారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రభావతిని పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న లంచం మెత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా తన అధికారిక విధులను నిష్పక్షపాతంగా నిర్వర్త్తించాల్సిన ఆమె ఇలా అడ్డదారులు తొక్కుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఆమెను నాంపల్లిలోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9440446106కు కాల్ చేయాలని సూచించారు. ఫేస్‌బుక్‌ పేజీలో Telangana ACB , ట్విట్టర్ ఎక్స్‌లో @Telangana ACB ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీకి సంబంధించిన క్యూర్ కోడ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు

Image 1

దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య

Posted On 2026-08-19 10:28:48

Readmore >
Image 1

పిఠాపురం AE కుటుంబం గల్లంతు... అల్లుడి హత్య నుంచి కోడలి లేఖ వరకు సాదిక్ పాత్రపై పోలీసుల ఫోకస్

Posted On 2026-08-19 10:10:39

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

Posted On 2026-08-19 10:09:20

Readmore >
Image 1

మట్టి వాసనలో మానవత్వం... మంజుల పతిపాటి జీవన ప్రస్థానం

Posted On 2026-08-19 09:15:41

Readmore >
Image 1

వేములవాడలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన "బాసింగా బలాలు" సింగర్ ఈశ్వర్ సాయి...

Posted On 2026-08-19 08:47:31

Readmore >
Image 1

దుమ్ముగూడెం లో వ్యక్తి పై హత్యాయత్నం...

Posted On 2026-08-19 08:22:31

Readmore >
Image 1

కామారెడ్డి విద్యా చరిత్రలో మరో అడుగు... రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్

Posted On 2026-08-19 07:49:30

Readmore >
Image 1

పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన ముదిరాజ్ సంఘం నాయకులు

Posted On 2026-08-18 18:31:15

Readmore >
Image 1

బైక్ దొంగల ముఠా అరెస్ట్ – ఇద్దరు నిందితులు రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-08-18 18:30:02

Readmore >
Image 1

మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్

Posted On 2026-08-18 15:37:03

Readmore >