| Daily భారత్
Logo




వేములవాడలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన "బాసింగా బలాలు" సింగర్ ఈశ్వర్ సాయి...

News

Posted on 2026-08-19 08:47:31

Share: Share


వేములవాడలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన "బాసింగా బలాలు" సింగర్ ఈశ్వర్ సాయి...

మరో నటితో ఉండగా పట్టుకున్న భార్య!

డైలీ భారత్, వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న బాసింగా బాసింగా బలాలే, ప్రమీల ఓ ప్రమీల వంటి హిట్ సాంగ్స్ ఫేమ్, ప్రముఖ జానపద గాయకుడు మరియు నటుడు ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధం బట్టబయలైంది. 

తోటి ఫోక్ సింగర్, సహనటి అయిన మధురి రాథోడ్‌తో కలిసి ఆయన ఏకాంతంగా ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య స్థానికుల సహాయంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలోని రెడ్డి భవన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

షూటింగ్ పరిచయం.. అక్రమ సంబంధానికి దారి? 

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానపద గీతాల షూటింగ్‌ల సమయంలో ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్‌లకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారంపై గత కొంతకాలంగా నిఘా ఉంచిన భార్య శరణ్య, సరైన సమయం కోసం వేచి చూశారు. 

అర్ధరాత్రి రెడ్డి భవన్‌లో దాడి.. కాళ్లావేళ్లా పడ్డ సింగర్!

వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్‌ (Reddy Sangham Bhavan) గదిలో ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ ఏకాంతంగా ఉన్నట్లు శరణ్యకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆమె తన బంధువులు, స్థానికులతో కలిసి అర్ధరాత్రి సమయంలో సదరు గదిపై దాడి చేశారు. గది తలుపులు తీయించి చూడగా లోపల భర్త ఈశ్వర్ సాయి, సహనటి మధురితో కలిసి అడ్డంగా దొరికిపోయారు. 

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య శరణ్య, స్థానికుల సమక్షంలోనే ఇద్దరినీ నిలదీశారు. రూమ్‌లోనే తీవ్ర వాగ్వాదం జరగడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆ సమయంలో అడ్డంగా బుక్కయిన ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి.. తన తప్పును మన్నించాలని, జీవితంలో మరో అవకాశం ఇవ్వాలంటూ భార్య కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. 

పోలీస్ స్టేషన్‌కు చేరిన రచ్చ!

తనకు అన్యాయం జరిగిందని, తన సంసారంలో నిప్పులు పోసిన భర్తతో పాటు అతనికి సహకరించిన మధురి రాథోడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శరణ్య వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇద్దరు కళాకారులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు. 

లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న గుర్తింపు పొందిన కళాకారులు ఇలాంటి వివాదంలో దొరికిపోవడంతో ఫోక్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

..... 

నా భర్త మంచోడే... ఆమెనే మీద పడి లొంగదీసుకుంది..

మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు..

ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను..

నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు..

నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి కంగుతిన్నాను

ఈ విషయంలో ఒకసారి నా కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను

నా భర్త మంచోడే కానీ అమ్మాయి మీద పడితే అతను మాత్రం ఏం చేస్తాడు?

ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు

– ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య

Image 1

దారుణం... ఆస్తి కోసం భర్త, 4 ఏళ్ల కుమారుడిని చంపిన భార్య

Posted On 2026-08-19 10:28:48

Readmore >
Image 1

పిఠాపురం AE కుటుంబం గల్లంతు... అల్లుడి హత్య నుంచి కోడలి లేఖ వరకు సాదిక్ పాత్రపై పోలీసుల ఫోకస్

Posted On 2026-08-19 10:10:39

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌

Posted On 2026-08-19 10:09:20

Readmore >
Image 1

మట్టి వాసనలో మానవత్వం... మంజుల పతిపాటి జీవన ప్రస్థానం

Posted On 2026-08-19 09:15:41

Readmore >
Image 1

వేములవాడలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన "బాసింగా బలాలు" సింగర్ ఈశ్వర్ సాయి...

Posted On 2026-08-19 08:47:31

Readmore >
Image 1

దుమ్ముగూడెం లో వ్యక్తి పై హత్యాయత్నం...

Posted On 2026-08-19 08:22:31

Readmore >
Image 1

కామారెడ్డి విద్యా చరిత్రలో మరో అడుగు... రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్

Posted On 2026-08-19 07:49:30

Readmore >
Image 1

పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన ముదిరాజ్ సంఘం నాయకులు

Posted On 2026-08-18 18:31:15

Readmore >
Image 1

బైక్ దొంగల ముఠా అరెస్ట్ – ఇద్దరు నిందితులు రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-08-18 18:30:02

Readmore >
Image 1

మొఘల్ దౌర్జన్యాలపై పోరాడిన సర్వాయి పాపన్న స్ఫూర్తి సదా చిరస్మరణీయం... సాయి గౌడ్

Posted On 2026-08-18 15:37:03

Readmore >