| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, రాజమహేంద్రవరం: రాజమండ్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

ఘటన వివరాలు... 

ది 10-08-2026 రాత్రి 11:05 గంటలకు కాతేరు నుండి ఫోర్త్ బ్రిడ్జి వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన ఒక యువతి మృతదేహం, తీవ్ర గాయాలతో ఒక యువకుడు ఉన్నట్లు NHAI హైవే పెట్రోల్ సిబ్బంది Dial 112 కు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న వెంటనే DSP సౌత్ జోన్, 3వ టౌన్ SHO మరియు రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతురాలు: వరదా ప్రసన్న @ మధు, 21 సంవత్సరాలు, శాంతి నగర్, రాజమండ్రి  

నిందితుడు: కుసుమ అభిలాష్, 21 సంవత్సరాలు, కోటిలింగాలపేట, రాజమండ్రి

పోలీసుల ప్రాథమిక విచారణలో ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉన్నట్లు తేలింది. రాత్రి 8:30 తర్వాత ఇద్దరూ బైక్ AP 40 CY 0662 పై సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో అభిలాష్ మధు మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది. అనంతరం అభిలాష్ పురుగుల మందు తాగాడు.

పోలీసులు అభిలాష్‌ను ముందుగా రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం MetSafe ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

ఈ మేరకు 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో CR NO: 369/2026, BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Previous సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Next దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
ADVERTISEMENT