పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో బిఆర్ఎస్ దుకాణం బంద్
డైలీ భారత్, మెదక్:మెదక్ నియోజక వర్గంలోని పాపన్నపేట మండల కేంద్రంలో నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపన్నపేట మండలం లోని యూసుఫ్ పేట గ్రామంలో బిఆర్ఎస్ వార్డు మెంబర్ లతో సహా టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండూవాను కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. పార్టీలో చేరిన వారు కె. శ్రీనివాస్ రెడ్డి, కె. సాయిబాబ గౌడ్ – వార్డు మెంబర్ 1, డి. శ్రీనివాస్ రెడ్డి, అరికెల సాయిలు – వార్డు మెంబర్ 4, యాదాగౌడ్, బెస్త శాలయ్య, మన్నె సాయిలు, ఎస్. వెంకట్ గౌడ్, టి. కిషన్ గౌడ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.