మెదక్ జిల్లా ఎస్పీ డా.శ్రీ.బి.బాలస్వామి
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో జిల్లా ఎస్.పి. డా .బి.బాలస్వామి మాట్లాడుతూ.... మెదక్ జిల్లా ఆపరేషన్ స్మైల్-X బృందం దాడులు నిర్వహించి బాలకార్మికులను పట్టుకొని వారిని పని నుండి విముక్తి కలిగించడం జరిగిందని బట్టల షాప్ లలో, ఆటో మొబైల్ షాపుల్లో పని చేస్తున్న79 మంది బాల కార్మికులను గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఇందులో 14 మంది అమ్మాయిలు ఉండగా 65 మంది బాలురు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ X బృందం గుర్తించి పట్టుకున్న వారిని డి సి పి ఓ వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ బాలస్వామి తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కి కానీ 1098 కి కానీ కాల్ చేసి వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ సూచించారు. ఈ కార్యాక్రమంలో ఎస్ఐ లు మల్లయ్య , శ్రీనివాస్ కానిస్టేబుళ్లు మోహన్, షరీఫ్, నర్సింహా రాజు, జ్యోత్స్న, జ్యోతి, రవి, శంకరయ్య మరియు జిల్లా ఆపరేషన్ స్మైల్ సిబ్బంది పాల్గొన్నారు.