డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మా రెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి హాజరైన చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ .ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని , కార్యకర్తలు, సీనియర్ నాయకులు ప్రతి గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ ల గూర్చి తెలియజేసి అర్హులు అయిన వారికి పథకాలు అందజేయాలని , వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపివ్వాలని లని ,స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నవాబూపెట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య , బి బ్లాక్ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి , రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి మరియు మండల అన్ని గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు , పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు. భారీ సంఖ్యలో పాల్గొన్నారు
News
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది : పామెన భీమ్ భరత్