| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామంతపూర్ గ్రామంలో పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

రామంతపూర్ గ్రామంలో పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు


ఏఈఓ రజిత రైతులకు సూచన

డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో పంటల వివరాల సేకరణ అదేవిధంగా వరి  పంటలను పరిశీలించడం  జరిగింది. అది ఏ ఈ ఓ రజిత పేర్కొన్నారు అనంతరం

1 . మొవ్వి పురుగు  ఈ  యాసంగిలో నారుమడి దశలో   ఆశించి నష్టపరుస్తుంది.  కనుక నారుమడిలో   కార్బో ఫ్యూరాన్ 3 జి గుళికలు లేదా 600 గ్రాముల ఫి ప్రోనిల్ 0.3 జి గుళికలు  వేయాలి. 

2. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న,  పిలక దశలో ఉన్న వరి పైరులో ఈ  యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బో ఫ్యూరాన్ 3 జి గుళికలు 10  కిలోలు లేదా కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8  కిలోలు లేదా క్లోరంట్రా నీలిప్రోల్ 0.4 జి గుళికలు 4  కిలోలు 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద  పదన లో వెయ్యాలి. 

3. మోగి పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10 జి  లేదా సేంద్రీయ గుళికలు  యూరియాలో కలిపి వేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులందరూ కూడా గుర్తించాలి. వ్యవసాయ అధికారి  రాజశేఖర్ పేర్కొన్నారు

Previous వేములవాడ ఆలయానికి 20 కోట్ల నిధులు మంజూరు: రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Next ఈవీఎం ల నిర్వహణ ను పూర్తి చేయాలి
ADVERTISEMENT