డైలీ భారత్: దీక్ష శిబిరం దగ్గరకు దీక్ష భగ్నం చేయడానికి వచ్చిన అనంతపురం జిల్లా పోలీసులు.
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీమంత్రి పరిటాల సునీత అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లో 24 గంటల ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే.
ఈరోజు పోలీసులు పరిటాల సునీత దీక్షను భగ్నం చేయడానికి వెళ్ళగా దీక్షను బలవంతంగా భగ్నం చేస్తే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ మెడకు కండువా బిగించుకొని పరిటాల సునీత పోలీసులను హెచ్చరించారు.